గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (12:20 IST)

మహేంద్ర సింగ్ ధోనీపై పరువునష్టం కేసు

Dhoni
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువునష్టం కేసును ఆయన వ్యాపార భాగస్వాములు నమోదు చేశారు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 
 
ఒప్పందాన్ని ఉల్లంఘించడం, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, అందుచేత నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.
 
2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ. 16 కోట్లు ఎగ్గొట్టారని ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయని పిటిషన్‌లో  పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న (గురువారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. 
 
కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదయింది.