బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (10:17 IST)

ఐపీఎల్ 2024- 160 ప్ల‌స్ టార్గెట్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో డీసీ అదుర్స్

Delhi Capitals
Delhi Capitals
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్నో నిర్దేశించిన‌ 168 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 18.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు 160కి పైగా స్కోర్‌ను కాపాడుకుని ల‌క్నో 13 సార్లు గెల‌వ‌డం విశేషం. 
 
ఐపీఎల్ చ‌రిత్ర‌లో ల‌క్నోపై 160 ప్ల‌స్ టార్గెట్‌ను ఛేదించి విజ‌యం సాధించిన తొలి జ‌ట్టుగా డీసీ అవ‌త‌రించింది. ఇక ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఢిల్లీ ఆట‌గాడు జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గ‌ర్క్ అర్ధ శ‌త‌కం (55)తో అద‌రగొట్టాడు. అలాగే కెప్టెన్ రిష‌బ్ పంత్ (41), ఓపెన‌ర్ పృథ్వీ షా (32) కూడా రాణించడంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు విజ‌యం సులువైంది.