ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (09:16 IST)

ఐపీఎల్ 2024-100 సిక్సర్లు.. రోహిత్ శర్మ ఖాతాలో రికార్డ్

Rohit Sharma
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు గాడిలో పడినట్లు తెలుస్తోంది.  సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో మెరుపులు మెరిపించాడు. 
 
24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 38 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో రీస్ టోప్లేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎవరూ దాన్ని బ్రేక్ చేయకపోవచ్చు. 
 
వాంఖెడే స్టేడియంలో 100 సిక్సర్లను కొట్టిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ ఒక్కడే కావడం విశేషం. ఒకే స్టేడియంలో టీ20 మ్యాచ్‌లల్లో 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ మరొకరు ఎవరూ లేరు. అలాంటి అరుదైన రికార్డును రోహిత్ శర్మ తన పేరు మీద లిఖించుకున్నాడు.