సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (13:43 IST)

చెన్నై నుంచి రాంచీకి కదిలిన ధోనీ..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహింద్రసింగ్ ధోనీ సొంతూరు రాంచీకి బయల్దేరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్‌ కోసం చెన్నై వచ్చిన ధోనీ.. రాంచీకి ప్రయాణమైనారు. ఈ నెల 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌.. ఏప్రిల్ 15 వరకు కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఫ్రాంఛైజీ తన ప్రాక్టీస్‌ సెషన్‌లో విరామం తీసుకుంది. 
 
దీంతో అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీ సహా రైనా, రాయుడు, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు తమ తమ ఇంటికి వెళ్లారు. చివరి రోజు ప్రాక్టీస్ సెషన్‌లో ధోనీ ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి చేరుకున్నారు. దీంతో ధోనీ వారందికి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
మరోవైపు కరోనా వైరస్ భారత్‌లోనూ వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, క్రీడలు, ర్యాలీలు సహా దాదాలు అన్ని రద్దయ్యాయి. ఇప్పటికే భారత్‌ లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ కరోనా కారణంగా రాంచీకి కదిలారు.