భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ధ్రువ్ జురెల్ ఎవరు..?
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి 5 మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం గాయం నుంచి కోలుకోని కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు. అయితే ఈ జట్టులో ఒక ఆటగాడి ఎంపిక మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి పేరే ధ్రువ్ జురెల్.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ప్లేయర్.. మూడో ప్రాధాన్య వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ ధ్రువ్ జురెల్ ఎవరని జనం సెర్చ్ చేయడం ప్రారంభించారు. టీమిండియా టెస్టు జట్టులోకి తీసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటని చాలామంది వెతుకుతున్నారు.
అయితే ధ్రువ్ జరెల్‌కు అద్భుతమైన ప్రతిభ ఉంది. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేయగలడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ తరపున ధ్రువ్ తొలిసారి మ్యాచ్ ఆడాడు.