సంబంధిత వార్తలు
- టిక్ టాక్ బ్యాన్: షేర్ చాట్‌ను కొనుగోలు చేయనున్న ట్విట్టర్?
- ఇమ్రాన్ ఖాన్: శ్రీలంక పార్లమెంటులో పాక్ ప్రధాని ప్రసంగం రద్దవడానికి కారణం భారతదేశమా?
- మొతేరా పింక్ బాల్ టెస్టు.. కోహ్లీ కోసం ఆ రికార్డ్ వెయిటింగ్..?
- తెలంగాణాలో కొత్త రకం కరోనా వైరస్.. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా...
- పెన్షనర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. 9.75 శాతం వడ్డీతో..?
మూడో టెస్ట్ : ఇంగ్లండ్ వెన్ను విరిచిన అక్షర్ పటేల్
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. డే అండ్ నైట్ తరహాలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణికిపోయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా అక్సర్ పటేల్, అశ్విన్‌లు రెచ్చిపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని (డకౌట్) ఇశాంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే అత్యధికంగా 53 పరుగులు చేశాడు.
మిగిలిన ఆటగాళ్ళలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్నింగ్స్ చేపట్టింది.
