మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (10:48 IST)

147 యేళ్ళ టెస్ట్ చరిత్రలో ఇంగ్లండ్ సరికొత్త రికార్డు

england test team
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు నెలకొంది. ఏకంగా 147 యేళ్ల టెస్ట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఇంగ్లండ్ జట్టు క్రెస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఆదివారం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతోపాటు అత్యంత అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. 
 
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో 100కుపైగా పరుగులు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. 104 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ బజ్బాల్ ఆటతీరుతో 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని లక్ష్య ఛేదనలో ఒక పరుగుకే ఓపెనర్ జాక్ క్రాలీ (1) వికెట్ను కోల్పోయింది. అయితే, మరో ఆటగాడు బెన్ డకెట్ దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లోనే 27 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇందులో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ ఉన్నాయి. 
 
అరంగేట్ర టెస్ట్ ఆటగాడు జాకోబ్ బెథెల్ 37 బంతుల్లో అజేయంగా అర్థ సెంచరీ (50 పరుగులు) సాధించాడు. అతడి స్కోర్ 8 బౌండరీలు, సిక్సర్ ఉన్నాయి. జో రూట్ మూడు బౌండరీలు, సిక్సర్‌తో 15 బంతుల్లోనే 23 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ సునాయాస విజయం సాధించింది. మొత్తంగా 12.4 ఓవర్లలోనే 100కుపైగా పరుగులను ఛేదించిన ఇంగ్లండ్ 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా అవతరించింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది.
 
2017లో బంగ్లాదేశ్‌తో ఇదే వేదికపై జరిగిన మ్యాచ్లో కివీస్ 109 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో సాధించింది. ఇప్పుడా రికార్డును ఇంగ్లండ్ తుడిచిపెట్టేసింది. అలాగే, లక్ష్య ఛేదనలో 8.21 రన్‌రేట్ సాధించింది. 100, ఆపై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓ జట్టు సాధించిన అత్యధిక రన్ రేట్ ఇదే కావడం గమనార్హం. 1983లో కింగ్‌స్టన్‌‍లో భారత్‌తో జరిగిన మ్యాలో విండీస్ 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6.82 రన్‌రేట్ సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడా రికార్డును కూడా ఇంగ్లీష్ జట్టు బద్దలు గొట్టింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మరో రికార్డు.