గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (18:33 IST)

2025 జనవరి 13 నుంచి 19 వరకు తొలి ఖో ఖో ప్రపంచ కప్

Kho Kho
2025 జనవరి 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి ఖో ఖో ప్రపంచకప్ జరగనుంది. భారత్, ఇంగ్లండ్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్‌తో సహా 24 దేశాల జట్లు ఇందులో పాల్గొంటాయి. 
 
Kho Kho
ఖో ఖో ప్రపంచ కప్ పురుషుల, మహిళల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఒక్కో విభాగంలో 16 జట్లు పోటీపడతాయి. ప్రారంభ ఖో ఖో ప్రపంచ కప్‌లో ఆఫ్రికా ఖండంలోని ఘనా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాలు పాల్గొంటుండగా, ఆసియాకు చెందిన భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నేపాల్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, శ్రీలంక ప్రాతినిధ్యం వహిస్తాయి.
 
ఇంగ్లండ్, జర్మనీ, నెదర్లాండ్స్, పోలాండ్‌లు యూరప్ క్లస్టర్‌గా ఏర్పడగా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి జట్లు ఉత్తర అమెరికా ఖండం తరపున బరిలోకి దిగుతాయి. బ్రెజిల్, పెరూ దక్షిణ అమెరికా నుండి పోటీ చేయగా, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ ఓషియానియా నుంచి బరిలోకి దిగుతాయి.