శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

నన్ను చంపేస్తారని బెదిరిస్తున్నారు : గౌతం గంభీర్

తనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి అంతర్జాతీయ ఫోన్‌ నంబర్‌ నుంచి తనకు హత్యా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తనకు, తన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తిచేశారు. గంభీర్‌ ఫిర్యాదును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా నంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.