ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (13:10 IST)

టీమిండియాకు భారీ షాక్ - ప్రపంచ కప్ నుంచి హార్దిక్ పటేల్ ఔట్!

Hardik Pandya
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టులోని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎడమకాలి ఎడమ చీలమండ గాయంతో ఇబ్బందిపడిన విషయం తెల్సిందే. ఈ కారణంగా ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్య ఆడలేదు. 
 
ఈ క్రమంలో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీకి వెళ్లిన తర్వాత నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని అంతా భావించారు. కానీ, 30 యేళ్ల ఆల్‌రౌండర్ పూర్తిగా కోలుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈ సమాచారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. ఐసీసీకి సమాచారం ఇచ్చింది. పైగా, హార్దిక్ స్థానంలో కర్నాటకకు చెందిన  ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. భారత్ తరపున 17 వన్డేలు ఆడి 29 వికెట్లు తీసిన కృష్ణ... ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా ఆడారు. 27 యేళ్ల కృష్ణ ఆదివారం కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ కోసం భారత జట్టుతో కలుస్తాడు.