గురువారం, 17 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (14:41 IST)

బంగ్లాదేశ్‌లో టీమిండియా వైట్ బాల్ టూర్ ... ఆగస్టు నుంచి ప్రారంభం

team india
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టూర్ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఢాకాకు వెళ్లనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించింది. కాగా, బంగ్లాదేశ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళి, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుంది. జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ జూలై నాలుగో తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 
 
భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే వన్డే సిరీస్ 
తొలి వన్డే మ్యాచ్ - ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే మ్యాచ్ - ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే మ్యాచ్ - ఆగస్టు 23 (ఛట్టోగ్రామ్)
 
భారత్ - బంగ్లాదేశ్ టీ20 సిరీస్ 
తొలి టీ20 - ఆగస్టు 26 (ఛట్టోగ్రామ్)
రెండో టీ20 - ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20 - ఆగస్టు 31 (మిర్పూర్)