శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 20 జులై 2017 (21:35 IST)

మహిళా ప్రపంచకప్... హర్మన్‌ప్రీత్ కౌర్ 171 నాటౌట్, ఇండియా 281

మ‌హిళల వ‌రల్డ్‌క‌ప్ సెమీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి 115 బంతుల్లో 171 పరుగులు సాధించి నాటవుట్‌గా నిలిచింది.. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ మూడు గంట‌ల‌కు

మ‌హిళల వ‌రల్డ్‌క‌ప్ సెమీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి 115 బంతుల్లో 171 పరుగులు సాధించి నాటవుట్‌గా నిలిచింది.. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ మూడు గంట‌ల‌కుపైగా ఆల‌స్యమవడంతో మ్యాచ్‌ను 42 ఓవ‌ర్ల‌కు కుదించారు. 
 
ఇకపోతే జట్టులో మంధన 6 పరుగులు, రౌత్ 14 పరుగులు, మిథాలీ రాజ్ 36, డి.బి శర్మ 25 పరుగులు, వి. కృష్ణమూర్తి 16 పరుగులు చేశారు.