బాక్సింగ్ డే.. విరాట్ కోహ్లీ కొత్త రికార్డు.. 16ఏళ్ల నాటి రికార్డ్ బద్ధలు

virat kohli
Last Updated: గురువారం, 27 డిశెంబరు 2018 (12:22 IST)
భారత్ -ఆస్ట్రేలియా జట్లు మరో హోరాహోరీ సమరం జరుగుతోంది. సిరీస్‌లో కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భావిస్తున్నాయి. ఫస్ట్ టెస్ట్‌లో గెలిచినా సెకండ్ టెస్ట్‌లో ఓడిన టీమిండియా ఒత్తిడిలో పడింది.

మరోవైపు చాలాకాలం తర్వాత టెస్ట్ విక్టరీని రుచిచూసిన కంగారూలు ఇదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టులో గతంలో నమోదైన ఒక్కో రికార్డునూ తన పేరిట లిఖించుకుంటూ సాగుతున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 16 ఏళ్ల నాటి మరో రికార్డును బద్ధలు కొట్టాడు. ఏడాది వ్యవధిలో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

2002లో విదేశాల్లో 1137 పరుగులను సాధించి రాహుల్ ద్రావిడ్, 1983 నాటి మొహీందర్ అమర్ నాథ్ (1065 పరుగులు) రికార్డును బద్ధలు కొట్టగా, 16 సంవత్సరాల తరువాత కోహ్లీ దాన్ని అధిగమించి, 1138 పరుగులు సాధించాడు. ఇదే సమయంలో మరో వ్యక్తిగత రికార్డును కూడా కోహ్లీ నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులను ఆస్ట్రేలియాపై (1573 పరుగులు) సాధించాడు.దీనిపై మరింత చదవండి :