ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:43 IST)

భారత్‌తో టెస్టు.. తొలి రోజు ఆట ముగిసింది.. ఇంగ్లండ్ స్కోర్ 263/3

India_England
చెన్నై చేపాక్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 89.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (128*; 197 బంతుల్లో, 14×4, 1×6) తన ఫామ్‌ను కొనసాగిస్తూ సెంచరీతో సత్తాచాటాడు.
 
ఓపెనర్‌ సిబ్లీ (87; 285 బంతుల్లో, 12×4) కూడా అర్థ శతకంలో రాణించడంతో.. మొదటి రోజు ఆట ముగిసేసరికి మెరుగైన స్థితిలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.
 
కాగా ఆట ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును కెప్టెన్ జో రూట్, డొమినిక్ సిబ్లీ ఆదుకున్నారు. అయితే ఆట ముగిసే చివరి క్షణంలో చివరి బంతికి సిబ్లీ(87) ఔట్ కావడంతో 263/3 తో ఇంగ్లాండ్ నిలిచింది.
 
అయితే మూడో వికెట్‌కు రూట్‌తో కలిసి సిబ్లీ 200 భాగసౌమ్యం నెలకొల్పారు. ఇక ఇదే క్రమంలో రూట్ తన 20వ శతకాన్ని పూర్తి చేసుకొని ఆట ముగిసే సమయానికి 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీయగా అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.