ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్: స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరు?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ శుభవార్త వచ్చింది.
గాయాలు, ఆటగాళ్ల గైర్హాజరీతో సతమతమవుతున్న భారత జట్టులోకి ఇప్పుడు ఓ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అడుగుపెట్టబోతున్నాడు.
కేఎల్ రాహుల్ రాంచీలో జరిగే నాల్గవ టెస్టులో భారత జట్టులో భాగం కావచ్చునని తెలుస్తోంది. గాయం కారణంగా రాహుల్ సిరీస్‌లో రెండు, మూడో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం వుంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 123 బంతుల్లో 86 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది.