మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (15:10 IST)

భారత్ - ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్ షెడ్యూల్... 5న తొలి టెస్ట్ ప్రారంభం

ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి అడుగుపెట్టిన టీమిండియా ఇపుడు స్వదేశంలో మరో ఇంగ్లీష్ జట్టు అయిన ఇంగ్లండ్‌తో తలపడనుంది. వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఈ టూర్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్​నూ గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్.. ఛాంపియన్ షిప్ ఫైనల్లో చోటు కోసం శ్రమిస్తోంది. లంకతో పాటు భారత్​పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాలని చూస్తోంది. 

త్వరలో భారత్‌కు వచ్చే ఇంగ్లండ్ జట్టు... నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5న జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభంకానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఆ తర్వాత టీ20 పోరు జరుగనుంది. 

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ముందున్న నేపథ్యంలో ఇరుజట్లు ఫొట్టి ఫార్మాట్​లో ఐదు మ్యాచ్​లు ఆడనున్నాయి. ఈ ఐదు టీ20లు అహ్మదాబాద్​లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. మార్చి 12న తొలి టీ20 జరగనుండగా 20న చివరి మ్యాచ్​ ఆడనున్నాయి.

అనంతరం మూడో వన్డేల సిరీస్ కోసం పూణెకు వెళ్తాయి. మార్చి 23న ప్రారంభం కానున్న 50 ఓవర్ల ఫార్మాట్ తొలి మ్యాచ్​తో పాటు మిగిలిన రెండు వన్డేలను పుణెలోనే ఆడనున్నాయి. 28న జరిగే వన్డేతో ఇంగ్లాండ్ పర్యటన పూర్తి కానుంది.

మొదటి రెండు టెస్టులకు ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే, 
ఇంగ్లండ్ : జో రూట్​(కెప్టెన్​), రోరీ బర్న్స్, డామ్​ సిబ్లీ, జోఫ్రా ఆర్చర్​, జాస్​ బట్లర్​, బెన్​ స్టోక్స్​, మొయిన్​ అలీ, జాక్​ క్రాలే, ఒల్లీ స్టోన్​, జేమ్స్​ అండర్సన్​, బెన్​ స్టోక్స్​, క్రిస్​ వోక్స్, డామ్ బెస్, డాన్ లారెన్స్, స్టువర్ట్ బ్రాడ్​, జాక్​ లీచ్.

రిజర్వు ఆటగాళ్లు: జేమ్స్ బ్రాసీ, మాసోన్ క్రేన్​, సకీబ్​ మహమూద్​, మ్యాట్ పార్కిన్సన్​, ఒల్లీ రాబిన్సన్​, అమర్​ విర్ది

భారత్ : రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), పుజారా, రహానె, పంత్, సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, శార్దుల్ ఠాకుర్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్