బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (11:31 IST)

ముంబై టెస్టు.. క్రీజులో పాతుకుపోయిన మయాంక్ అగర్వాల్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట కొన‌సాగుతోంది. టీమిండియా ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ క్రీజులో పాతుకు పోయి నాలుగు సిక్సులు, 16 ఫోర్ల సాయంతో 143 ప‌రుగులు చేశాడు.
 
అంతకుముందు 221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్.. ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు.
 
ఆజాజ్ స్పిన్ ధాటికి వృద్దిమాన్ సాహా తన ఓవర్ నైట్ స్కోర్‌కు 2 పరుగులు మాత్రమే జత చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు రెండో ఓవర్‌లోనే సాహాను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఆజాజ్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 
 
ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్.. గోల్డెన్ డక్‌గా తెల్ల మొహం వేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా కోల్పోయిన 6 వికెట్లను ఆజాజ్ పటేల్ తీయడం విశేషం.