సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2023 (11:20 IST)

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. రికార్డుల కోసం క్రికెటర్లు రెడీ

indo - pakistan
డెంగీ నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టిన టీమిండియా యువకెరటం శుభ్ మాన్ గిల్ ప్రాక్టీసులో పాల్గొన్నాడుయ. జట్టు సహచరులతో జోకులు వేస్తూ, నవ్వుతూ హుషారుగా కనిపించాడు. 
 
శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య కీలక సమరం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ముమ్మరంగా కసరత్తులు చేశారు. 
 
రేపు పాకిస్థాన్ తో అత్యంత కీలక మ్యాచ్ ఉండడంతో గిల్ వంటి ప్రతిభావంతుడైన ఓపెనర్ అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే కొత్తబంతితో పాక్ లెఫ్టార్మ్ సీమర్ షహీన్ అఫ్రిది ఎంతో ప్రమాదకారి. అతడిని పవర్ ప్లే వరకు నిలువరించగలిగితే చాలు... బంతి పాతబడిన తర్వాత మిగతా ఓవర్లలో దూకుడుగా ఆడే వెసులుబాటు ఉంటుంది. 
 
అటు డిఫెన్స్, ఇటు అఫెన్స్ ఎంతో సమర్థంగా ఆడే గిల్ పాక్ పై భారత లైనప్ కు వెన్నెముకలా నిలవాలని టీమ్ మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. 
 
అయితే ఈ మ్యాచులో పలు రికార్డులు బద్దలు కొట్టేందుకు ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్ రోహిత్ కూడా గిల్ 99 శాతం ఈ మ్యాచ్ ఆడతాడనే చెప్పాడు. అతను కనుక ఆడితే.. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేస్తే అరుదైన ఘనత సాధిస్తాడు. 
 
ఇప్పటి వరకు తన కెరీర్‌లో 35 వన్డే ఇన్నింగ్సులు ఆడిన గిల్ 1917 పరుగులు చేసి ఉన్నాడు. అతను కనుక ఈ మ్యాచులో 83 పరుగులు చేస్తే కేవలం 36 ఇన్నింగ్సుల్లోనే 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 
 
పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా వన్డేల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.