రెండో టీ-20 దక్షిణాఫ్రికా గెలుపు.. ధోనీ, పాండే మెరిసినా నో యూజ్
ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్ పాండే (79 నాట
ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్ పాండే (79 నాటౌట్), ధోని (52 నాటౌట్) మెరిసినా భారత్ గెలుపును నమోదు చేసుకోలేకపోయింది.
ధోనీ, మనీష్ పాండే మెరుగ్గా రాణించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4వికెట్లకు 188 పరుగులు సాధించింది. కానీ తదనంతరం క్లాసన్‌తో పాటు డుమిని (64 నాటౌట్) విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా విజయాన్ని సఫారీల జట్టు తన ఖాతాలో వేసుకుంది.
ఇకపోతే.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 11 ఏళ్ల టీ-20 కెరీర్‌లో రెండే అర్థ సెంచరీలు చేశాడు. అయితే బుధవారం దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20లో ధోనీ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు. ధోనీకి ఇది 77వ టీ20 ఇన్నింగ్స్ కావడం గమనార్హం. అయినా రెండో టీ-20లో భారత్ పరాజయం పాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో దక్షిణాఫ్రికా సమం అయింది. సిరీస్ విజయాన్ని తేల్చే చివరి మ్యాచ్ శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది.