బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:56 IST)

భువనేశ్వర్ అదుర్స్.. ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు... అదీ మూడు ఫార్మట్లలో?

టీమిండియా స్టార్ బౌలర్ భుమనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డును సృష్టించాడు. మూడు క్రికెట్ ఫార్మెట్లలో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా భువనేశ్వర్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో ఆ

టీమిండియా స్టార్ బౌలర్ భుమనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డును సృష్టించాడు. మూడు క్రికెట్ ఫార్మెట్లలో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా భువనేశ్వర్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భువీ, మూడు ఫార్మట్లలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా భువనేశ్వర్ నిలిచాడు. 
 
ఇప్పటికే 21 టెస్టులాడిన భువనేశ్వర్.. నాలుగు సార్లు ఐదు వికెట్ల పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో 86 వన్డే మ్యాచ్‌లు ఆడి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనతను దక్కించుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలిగే అవకాశం ఉండే టీ-20 మ్యాచ్‌ల్లోనూ ఐదు వికెట్లను తీయడంతో ఇప్పుడు భువీ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.