భారత స్పిన్నర్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో 350 వికెట్లను తీసుకున్నాడు. ఈ వికెట్‌ను తీయడం ద్వారా శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు.
వీరిద్దరూ ఈ ఫీట్‌ను తామాడిన 66వ మ్యాచ్‌లో సాధించడం గమనార్హం. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 350వ వికెట్‌ను 77వ టెస్టులో, హర్భజన్ సింగ్ 83వ టెస్టులో సాధించారు. నేడు బ్రియాన్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును సాధించాడు.
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డి బ్రియన్ బౌల్డ్ చేయడంతో అశ్విన్ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ అరుదైన రికార్డుతో రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.