శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (15:48 IST)

ఢిల్లీ వేదికగా థర్డ్ వన్డే మ్యాచ్ : టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు

cricket balls
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, మంగళవారం ఢిల్లీ వేదికగా మూడో వన్డే మ్యాచ్ మొదలైంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డే మ్యాచ్‌ ఢిల్లీ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే.. 
సౌతాఫ్రికా : క్వింటన్ డికాక్, మలన్, హెండ్రిక్స్, మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, ఫెహ్లూక్వాయో, ఫోర్టుయిన్, ఎన్గిడి, నోర్ట్జే
 
భారత : శిఖర్ ధవాన్, గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అహ్మద్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆవేష్ ఖాన్