శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (23:51 IST)

నరాలు తెగే ఉత్కంఠ పోరులో T20 ప్రపంచ కప్‌ను ముద్దాడిన రోహిత్ సేన (video)

India
India
ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. రెండోసారి టీ20 వరల్డ్ కప్ చాంపియన్లుగా నిలవాలని బరిలోకి దిగిన భారత్-దక్షిణాఫ్రికా ఆద్యంతం అమీతుమీ పోరాడాయి. చివరికి ఏడు పరుగుల తేడాతో భారత్ విజయభేరీ మోగించింది. 
 
తొలిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్న దక్షిణాఫ్రికాకు ఆ కల నెరవేరలేదు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన సఫారీలు మెరుగ్గా ఆడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లు సఫారీ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. 
 
సఫారీ ఆటగాళ్లలో ఓపెనర్లలో హెండ్రిక్స్ (4) అవుటైనా డికాక్ (39) రాణించాడు. ఆపై ఐడెన్ మార్క్రమ్ (4), స్టబ్స్ (31), హెన్రిచ్ (52) అదరగొట్టారు. డేవిడ్ మిల్లర్ (18), మార్కో జాన్సెన్ (2) చివరి వరకు పోరాడారు. కేశవ్ మహారాజ్ (2), రబాడా (4), నార్జే (1)లు పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, బుమ్రా రెండోసి వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. 
 
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఆటగాళ్లలో టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ రికార్డ్‌ను విరాట్ కోహ్లీ సమం చేశాడు. 
Team India
Team India
 
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో శనివారం జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీకి ఇది 39వ హాఫ్ సెంచరీ. 
 
సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కళ్లు చెదిరే రనౌట్‌తో ఔరా అనిపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో శనివారం జరిగిన ఫైనల్లో డికాక్ సూపర్ ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 
 
ఈ క్రమంలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ పంపించగా.. అతను కోహ్లీ సాయంతో చెలరేగాడు.
 
డికాక్ స్టన్నింగ్ డెలివరీతో అక్షర్ పటేల్ అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాడు. రబడా వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతి కోహ్లీ ప్యాడ్‌ను తాకి కీపర్ వైపు దూసుకెళ్లింది. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న అక్షర్ పటేల్ క్విక్ సింగిల్ కోసం అప్పటికే హాఫ్ పిచ్ ధాటాడు.
 
బంతిని డికాక్ అందుకోవడం చూసిన కోహ్లీ సింగిల్‌కు నిరాకరించాడు. దాంతో అక్షర్ పటేల్ యూటర్న్ తీసుకొని లేజీగా పరుగెత్తాడు. బంతిని అందుకున్న క్వింటన్ డికాక్ తెలివిగా నాన్‌స్ట్రైకర్ వికెట్ల వైపు త్రో చేసాడు. ఆ త్రో కాస్త నేరుగా వికెట్లను తాకడంతో అక్షర్ పటేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. 
 
అక్షర్ పటేల్ ఔటవ్వడం టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశాలను దెబ్బతీసింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది.