గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (21:59 IST)

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ రెండో సెమీస్ మ్యాచ్ : ప్రారంభమైన మ్యాచ్ - భారత్ 2 వికెట్లు డౌన్

ind vs eng
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, గురువారం రాత్రి గయానా వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే, తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో బ్యాటింగ్ దిగిన భారత్ తన తొలి వికెట్‌ను 2.4 ఓవర్లలో 19 పరుగుల వద్ద కోల్పోయింది. కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా క్రీజ్‌లో కుదురుకోకుండానే కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 40 పరుగులు. అయితే, మరో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 37, సూర్య కుమార్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ స్కోరు 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.