గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 29 జూన్ 2024 (22:17 IST)

World T20 ప్రపంచ కప్ ఫైనల్, టీమిండియా స్కోర్: 176, కోహ్లి 76 పరుగులు

virat kohli
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వెస్టిండీస్‌లో ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. ఐతే ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ 9 పరగులు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 3 పరుగులు చేసి రబడా బౌలింగులో అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ దశలో జట్టు స్కోరు 4.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 34 పరుగులు.
 
అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కాస్త నిలదొక్కుకున్నాడు. విరాట్ కోహ్లితో కలిసి 13.3 ఓవర్లలో 106 పరుగులు చేసారు. అక్షర్ పటేల్ 47 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దూబె 27 పరుగులు చేసాడు. అర్థ సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లి ధాటిగా ఆడాడు. 18.5 ఓవర్లో జాన్సన్ వేసిన బంతిని కొట్టడంతో అది రబడా చేతుల్లో పడింది. దాంతో 76 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఇన్సింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా 5 పరుగులు, రవీంద్ర జడేజా 2 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది టీమిండియా జట్టు.
 
మరోవైపు దక్షిణాఫ్రికా 3.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆటగాళ్ల వికెట్లు పతనమవుతుండటంతో దక్షిణాఫ్రికా ప్లేయర్స్ బెంబేలెత్తుతున్నారు.