గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (16:07 IST)

నవంబరులో సౌతాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా!

team india
భారత క్రికెట్టు ఈ యేడాది నవంబరు నెలలో సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీమిండియా నాలుగు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ క్రికెట్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భారత క్రికెట్ జట్టు నవంబరు 8 నుంచి 15 వరకు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. 2024-25 సీజన్‌కు స్వదేశంలో భారత్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించిన అనంతరం.. దక్షిణాఫ్రికా తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.
 
షెడ్యూల్‌ ఇదే..
తొలి టీ20: నవంబర్‌ 8, వేదిక డర్బన్‌
రెండో టీ20: నవంబర్‌ 10, వేదిక గబేహా
మూడో టీ20: నవంబర్‌ 13, వేదిక సెంచూరియన్‌
నాలుగో టీ20: నవంబర్‌ 15, జొహన్నెస్‌బర్గ్‌
గత ఏడాది భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టింది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. ఇందులో వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో గెలవగా.. టెస్టు, టీ20 సిరీస్‌ల్లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి.