చాంపియన్స్ ట్రోఫీ కోసం 48 గంటల్లో జట్టును ఎంపిక చేస్తాం : బీసీసీఐ
ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా
ఇంగ్లండ్ వేదికగా జరిగి ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొంటుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును 48 గంటల్లో ప్రకటించనున్నట్టు బీసీసీఐ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఆదివారం ఉదయం బీసీసీఐ సమావేశమైంది. ఇందులో ఐసీసీతో రెవెన్యూ షేరింగ్ మోడల్ సహా పలు అంశాలను చర్చించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపాలని తీర్మానించారు.
జూన్ ఒకటో తేదీ నుంచి లండన్‌లో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని, జట్టు ఎంపికను 48 గంటల్లో పూర్తి చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
కాగా, కొత్త ఆదాయ పంపిణీ విధానంతో బీసీసీఐ ఆదాయం 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గిపోనుండగా, దీనిపై అసంతృప్తిని వెలిబుచ్చిన బీసీసీఐ, ట్రోఫీ నుంచి విరమించుకునే ఆలోచన చేసిన సంగతి తెలిసిందే.