శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (09:30 IST)

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మయాంక్ అగర్వాల్

యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మయాంక్ ‘ఓరల్ ఇరిటేషన్’కు గురయ్యాడని, అతడి పెదాలు వాచిపోయాయని ఐఎల్ఎస్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

జనవరి 30న ఆస్పత్రిలో చేరాడని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వివరించింది.
 
ఫ్లైట్‌లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గొంతులో వాపు, బొబ్బలు రావడంతో వెంటనే అతడిని విమానం దించి స్థానికంగా ఉన్న ఐఎల్ఎస్ హాస్పిటల్‌కు తరలించారు.