శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (11:31 IST)

యూట్యూబ్ స్టార్‌ను పెళ్లాడనున్న చాహల్.. డెంటిస్ట్ అయినా కొరియోగ్రాఫర్‌‍గా...?

Chahal
టీమిండియా స్పిన్నర్ చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇంకా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మేరకు ధనశ్రీ వర్మను తాను వివాహం చేసుకోబోతున్నానంటూ శనివారం ఈ స్పిన్నర్‌ ప్రకటించాడు. ధనశ్రీ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ ఆమె యూట్యూబ్‌ స్టార్‌గా అందరికీ తెలుసు. 
 
ధనశ్రీ కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షలకొద్దీ వ్యూస్‌ లభించడం గమనార్హం. మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంతో కనిపించే చాహల్‌లానే ధనశ్రీ సైతం అంతే యాక్టివ్‌గా ఉంటుందని ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
 
ముంబైకి చెందిన ధనశ్రీ డెంటిస్ట్‌. 2014లోనే ఆమె నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి డిగ్రీ పొందింది. అయితే కొరియోగ్రఫీ అంటేనే ఆమెకు మక్కువ. ఆమెకు ధన శ్రీ వర్మ పేరిట ఓ డ్యాన్స్‌ అకాడమీ కూడా ఉంది. 
 
ఆమె సొంత యూట్యూబ్‌ ఛానెల్‌కు 15 లక్షల మంది సబ్‌స్కైబర్లు కూడా ఉన్నారు. ఆమె ఇన్‌స్టాను కూడా సుమారు 5 లక్షల మందికిగా పైగా అనుసరిస్తున్నారు. చాహల్‌తో వివాహం ఖరారైనట్లు ధనశ్రీ పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు 2లక్షకు పైగా లైకులు వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్‌ను అర్థం చేసుకోవచ్చు.