శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (15:46 IST)

ఐపీఎల్ 13వ సీజన్.. రాంచీలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న ధోనీ

Dhoni
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన స్వస్థలమైన రాంచీలో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని చెన్నై జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనా చెప్పిన ఒక రోజు తర్వాత.. మహీ ప్రాక్టీస్ ఆరంభించడం విశేషం. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ జరగనుంది. 
 
ఈ నేపథ్యంలో అందరి కళ్లు ఎంఎస్‌‌ ధోనిపై ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ధోని బరిలోకి దిగుతాడా.. అతని ఆటను ఎప్పుడు కళ్లారా చూస్తామా అంటూ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
 
ఎందుకంటే 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం మళ్లీ టీమిండియా జట్టులో ధోని కనబడలేదు.. ఆడలేదు. దాదాపు ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ గ్రీన్‌ సిగ్నల్ దొరకడంతో మళ్లీ ధోనీ బరిలోకి దిగనున్నాడు.