శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (11:35 IST)

అరోన్ ఫించ్ అదుర్స్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్

Aron pinch
Aron pinch
శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆరోన్ ఫించ్ బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
 
2010లో రాజస్తాన్ రాయల్స్, 2011-12 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్, 2013లో పుణే వారియర్స్, 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్, 2016,17లో గుజరాత్ లయన్స్, 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఫించ్ ఆడాడు.
 
ఇకపోతే... గత రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. ఈ పరాజయంతో కోల్‌కతా నాలుగో స్థానానికి పడిపోయింది. 
 
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. 
 
ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ముంబైలో మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుండగా, ఢిల్లీ కేపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంఖడేలో 7.30 గంటలకు రెండో మ్యాచ్ జరగనుంది.