గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:43 IST)

ఐపీఎల్ 2022లో కరోనా కలకలం.. పాట్రిక్ ఫర్హత్‌కు కోవిడ్ పాజిటివ్

Patrick Farhart
Patrick Farhart
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపింది. ఐపీఎల్ 2022లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
ప్రస్తుతం పాట్రిక్ ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ వైద్య బృందం ఫర్హత్‌ను పర్యవేక్షిస్తోంది. ముంబైలోని బయో సేఫ్ బబుల్‌లో ఉన్న ఫర్హత్‌కు కరోనా సోకడంతో ఢిల్లీ ప్రాంచైజీ ఆందోళనలో ఉంది.  
 
దీంతో ఏప్రిల్ 16 ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్యాట్రిక్‌ గతంలో టీమిండియా ఫిజియోగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు కేసులు తగ్గుముఖం పట్టడంతో స్టేడియాల్లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఐపీఎల్ జట్లు ఇప్పటికీ కఠినమైన బయో బుడగల నీడలో ఉన్నాయి.