మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 26 మే 2024 (22:43 IST)

IPL 2024 Final: ఐపీఎల్ కప్ KKRదే, 8 వికెట్ల తేడాతో SRH పైన ఘన విజయం

KKR
IPL 2024 కప్‌ను KKR కోల్ కతా నైట్ రైడర్స్ ఎగరేసుకెళ్లింది. SRH ఫైనల్ మ్యాచులో తడబాటుకు గురైంది. ఫలితంగా 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సునాయాస లక్ష్యాన్ని ఛేదించడంలో KKR నైట్ రైడర్స్ చాలా సౌకర్యవంతంగా ముందుకు సాగింది.
 
ఓపెనర్‌గా దిగిన రహ్మనుల్లా 32 బంతుల్లో 39 పరుగులు చేసాడు. సునీల్ 6 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అర్థసెంచరీ చేయడమే కాకుండా నాటవుట్‌గా నిలిచాడు. రెండు వికెట్లు కోల్పేయేటప్పటికే జట్టు స్కోరు 102కి చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన తోటి జట్టు సభ్యుడు వెంకటేష్ అయ్యర్ కలిసి కేవలం 10.3 ఓవర్లలోనే 114 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు.