గురువారం, 27 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (16:30 IST)

ఐపీఎల్ 2024 : చివరి లీగ్ మ్యాచ్‌ టాస్ గెలిచిన పంజాబ్ జట్టు

srh  vs pbks
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరింది. తాజాగా పంజాబ్‌పై గెలిస్తే ఆ స్థానాన్ని మరింతగా మెరుగుపరుకోనుంది. అయితే, ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌‍లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. 
 
ఈ మ్యాచ్‌కు హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికకానుంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ జట్టుకు మొదట బ్యాటింగ్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ జట్టు కెప్టెన్ జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
 
కాగా, ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో రాహుల్ త్రిపాఠికి తుది జట్టులో స్థానం కల్పించారు. అటు పంజాబ్ జట్టులో కెప్టెన్ శామ్ కరన్ సహా చాలా మంది విదేశీ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం తమ జాతీయ జట్లలో చేరేందుకు వెళ్లిపోయారు. దీంతో ఆదివారం సన్ రైజర్స్‌‍తో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో రిలీ రూసో రూపంలో ఒక్క విదేశీ ఆటగాడు మాత్రమే ఆడుతున్నాడు.