గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:29 IST)

మార్చి 22 నుంచి ఐపీఎల్ షెడ్యూల్ - మొదటి 10-12 రోజులకు మాత్రమే షెడ్యూల్ రిలీజ్

ipl2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ఎ) 2024 సీజన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా షెడ్యూల్‌ను ప్రకటించినట్టు క్రికెట్ బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించకుండా కేవలం పది నుంచి 12 రోజులకు మాత్రమే ఈ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఈ టోర్నీలో భాగంగా, తొలి మ్యాచ్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌ చెన్నై వేదికగా జరుగనుంది. 
 
ఏప్రి నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుంది. ఈ ఎన్నికల తేదీల నిర్వహణ ఇంకా ఖరారు కాలేదు. ఈ ఎన్నికల తేదీపై భారత ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చాక ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారని వివరించింది. తొలి 10-12 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించనున్నామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌ను ఉటంకిస్తూ క్రికెట్రిపోర్ట్ పేర్కొంది. ఆరంభంలో మొదటి 10-12 రోజుల షెడ్యూల్ మాత్రమే వెల్లడించనున్నామని అన్నారని పేర్కొంది. 
 
కాగా ఆతిథ్య వేదికలు 10 కంటే ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉండనున్నాయని తెలుస్తోందని రిపోర్ట్ పేర్కొంది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి రెండు, మూడు వారాల మధ్య ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వెల్లడికానుంది. 
 
ఐపీఎల్2024 సీజన్ వచ్చే నెల మార్చి 22 నుంచి ప్రారంభం కానుందని ఇటీవలే నిర్ధారణ అయ్యింది. ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ ఈ విషయాన్ని నిర్ధారించారు. చెన్నైలో తొలి మ్యాచ్ జరగనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఇంకా తమకు సమాచారం అందలేదని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతానికి ప్రత్యర్థి జట్లపై ప్రస్తుతానికి ఎలాంటి ఎలాంటి సమాచారం లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.