బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (08:21 IST)

ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో "ఇమేజ్ హబ్"

image hub
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పెరుంబాక్కంలోని ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ హబ్‌లో కొత్తగా ఇమేజ్ హబ్‌ను నెలకొల్పారు. ఈ హబ్ ప్రారంభోత్సవ వేడుక గురువారం అట్టహాసంగా జరిగింది. ఇందులో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్లు శ్రీధర్ మాస్టర్, ఆయన కుమార్తె అక్షద శ్రీధర్, సినిమాటోగ్రాఫర్ విదు అయ్యన్న, ఐసీసీఆర్ మాజీ రీజినల్ డైరెక్టర్ కె.మహమ్మద్ ఇబ్రహీం ఖలీల్, ఆర్చిడ్స్ అకడమిక్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బి.మంజుల, స్కూలు ప్రిన్సిపాల్ టి.లావణ్య, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్ట్రానమీ, రోబోటిక్స్, మాక్ కోడింగ్, టింకరింగ్, డ్యాన్స్, థియేటర్, మ్యూజిక్, వీవింగ్ అండ్ ప్రింటింగ్, పాటరీ, పెయింటింగ్ ప్రయోగశాలలను కూడా ప్రారంభించారు. 
 
ఇందులో ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థులు మేథోసంపత్తిని పెంపొందించేందుకు ఈ ప్రత్యేక ల్యాబ్‌‍లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వీటి ద్వారా చదువులతో పాటు నృత్యం, సంగీతం, కళాత్మక వస్తువుల తయారీ తదితర కళలలో సునిశిత శిక్షణ పొందగలుగుతామని వెల్లడించారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిందడ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.