బేబీ ఐపీఎల్ పేరిట పొట్టి క్రికెట్ పోటీలు : బీసీసీఐ ప్లాన్
బేబీ ఐపీఎల్ పేరిట పొట్టి క్రికెట్ పోటీలు పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఛాంపియన్స్ లీగ్ ట్వీంటీ-20 పోటీల స్థానంలో మినీ ఐపీఎల్ పోటీలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్న బీసీసీఐ బేబీ క్రికెట్ పోటీలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన మినీ ఐపీఎల్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయని, ఈ రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఈ పోటీలు తెరపైకి వస్తే ఛాంపియన్స్ లీగ్ పోటీలు జరగవని తెలుస్తోంది. ఇకపోతే.. బేబీ ఐపీఎల్‌లో 8 జట్లుంటాయని, 15 మ్యాచ్‌లు జరుగుతాయని సమాచారం. జట్లను రెండు గ్రూపులుగా చేసి, లీగ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరపాలన్నది బీసీసీఐ పెద్దల ప్రతిపాదనగా తెలుస్తోంది. గతంలో ప్రతిపాదించిన మినీ ఐపీఎల్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఉంటాయి.