గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ది హండ్రెడ్ లీగ్ : చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్!!

pollard
'ది హండ్రెడ్ లీగ్' టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టు ఆటగాడు కీన్ పొలార్ట్ చరిత్ర సృష్టించాడు. బ్యాట్‌తో వీరవిహారం చేసి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జట్టును గెలిపించారు. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ వేసిన ఓ ఓవరులో వరుసగా ఏకంగా 5 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 'ది హండ్రెడ్' లీగ్ ఒక ఓవర్లో తాను ఎదుర్కొన్న అన్ని బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి ఆటగాడిగా పొలార్డ్ నిలిచాడు. పొలార్డ్ ఆడిన ఈ సంచలన ఇన్నింగ్స్ 'ట్రెంట్ రాకెట్స్'పై 'సదరన్ బ్రేవ్' జట్టు 2 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.
 
తన ఇన్నింగ్స్ ప్రారంభంలో 14 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే రాబట్టి ఇబ్బంది పడ్డట్టుగా పొలార్డ్ కనిపించాడు. ఆ సమయంలో సదరన్ బ్రేవ్ జట్టు గెలుపునకు 20 బంతుల్లో 49 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్ జారిపోతున్నట్లుగా అనిపించింది. ఆ సమయంలో రషీద్ ఖాన్ తన చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. 
 
రషీద్‌పై పొలార్డ్ విరుచుకుపడ్డారు. వరుసగా ఆరు బంతులనూ సిక్సర్లు బాదాడు. దీంతో గెలుపు సమీకరణం 15 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది. పొలార్డ్ 23 బంతుల్లో 45 పరుగులు బాది ఔటయ్యాడు. ఆ తర్వాత క్రిస్ జోర్డాన్ మిగతా పనిని పూర్తి చేయడంతో సదరన్ బ్రేవ్ జట్టు సునాయాసంగా గెలిచింది.