గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (09:37 IST)

భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం... టైటిల్ విజేతగా లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం వెలుగులోకి వచ్చారు. అతని పేరు లక్ష్యసేన్. గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లక్ష్యసేన్ సాధించిన విజయాలే ఆయన ప్రతిభకు కొలమానంగా మారాయి. 
 
పైగా, ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షి‌ప్‌లో పురుషుల సింగిల్స్ విజేతగా ఆయన అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లక్ష్యసేన్ వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌లో సింగపూర్‌కు చెందిన కీన్ యూపై ఘన విజయం సాధించారు. 
 
ఇరవై యేళ్ళ లక్ష్యసేన్ గత నెలలో స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ కప్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే, ఆదివారం జరిగిన పోటీల్లో ఇండియన్ ఓపెన్ ఫైనల్లో అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ 24-22, 21-17 తేడాతో విజయభేరీ మోగించారు. అదీ కూడా వరుస గేముల్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.