సోమవారం, 18 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 28 జులై 2016 (15:13 IST)

శ్రీలంక స్పిన్ మాంత్రికుడికి అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం!

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ ఘనత సాధించాడు.

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా మురళీధరన్ ఘనత సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ కరేన్ రోల్టన్, ఆర్థర్ మోరీస్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్), 19వ శతాబ్దపు మేటి బౌలర్ జార్జ్ లిహ్‌మన్ (ఇంగ్లండ్) కూడా స్థానం దక్కించుకున్నారు. 
 
ముత్తయ్య మురళీధరన్ ముంబైలో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ముత్తయ్య టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టగా, వన్డేల్లో 534 వికెట్లు సాధించగా, పొట్టి ఓవర్ల ట్వంటీ-20ల్లో 13 వికెట్లు సాధించారు. 1993 నుంచి 2013 వరకు సాగించిన తన క్రికెట్ కెరీర్‌లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2002 కోసం ఎంపికైన జట్లలో స్థానం దక్కించుకున్నారు.