సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 మే 2024 (22:40 IST)

గంగూలీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఏంటది?

hardik pandya
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఇది 43వ మ్యాచ్. 
 
ఇక సౌరవ్ గంగూలీ 2008 నుంచి 2012 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్, పుణేవారియర్స్ జట్లకు సారథ్యం వహించాడు. సారథిగా దాదా 42 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ రికార్డును హార్దిక్ దాటేశాడు. 
 
అలాగే జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇకపోతే.. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 174 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. 
 
హార్దిక్ పాండ్యా(3/31), పియూష్ చావ్లా(3/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది.