మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 మార్చి 2018 (18:00 IST)

షమీ భార్యకు చిర్రెత్తుకొచ్చింది... కెమెరాలు పగిలిపోయాయ్...

భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొ

భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొట్టింది. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కట్టుకున్న భర్త షమీపై తీవ్ర ఆరోపణలతో రోజూ పతాక శీర్షికల్లో నిలుస్తున్న హసీన్ మంగళవారం కోల్‌కతాలోని సెంయింట్ సెబాస్టియన్ స్కూల్ ఆవరణలో మీడియాపై అసహనాన్ని ప్రదర్శించింది. వీడియో జర్నలిస్టులు తనను కెమెరాల్లో బంధిస్తుండగా అసహానికి గురైన ఆమె ఒక్కసారిగా కెమెరాను అందుకుని పగలగొట్టారు. మీడియా వేస్తున్న ప్రశ్నలకు విసుగుచెంది గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో మీడియా సిబ్బందితో పాటు.. అక్కడున్న వారంతా అవాక్కవడం మీడియా వంతైంది. షమీపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ఎదుట కూల్‌గా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా రెచ్చిపోయి దాడిచేయడంతో విలేకరులు బిత్తరపోయారు.