గురువారం, 30 నవంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (14:29 IST)

ధోనీ కొత్త అవతారం.. పోలీస్ ఆఫీసర్ పాత్రధారిగా... నెట్టింట్లో సందడి

dhoni police
తన కెప్టెన్సీ దేశానికి రెండు ప్రపంచ కప్‌లను అందించిన భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇపుడు కొత్త అవతారమెత్తాడు. తాజాగా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ధోనీకి సంబంధించిన పాత్ర ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మాజీ ప్రపంచ కప్ విజేత పోలీస్ అధికారి యూనిఫాంలో కనిపిస్తున్నాడు. 
 
దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు ధోనీ ఎపుడు పోలీస్ ఆఫీసర్ అయ్యారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నిజానికి ధోనీ పోలీస్ ఆఫీసర్‌గా మారలేదు. అలాగే, ధోనీ కూడా సినిమాల్లో అడుగుపెట్టలేదు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించారు. కాగా,  క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నారు.