టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మైలురాయి.. 5.3 కోట్ల మంది వీక్షించారట!
బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా మ్యాచ్ చూసేందుకు దేశ ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. 11 సంవత్సరాల పాటు ఐసిసి ట్రోఫీని గెలవని భారత్.. ప్రపంచ కప్ గెలుస్తుందనే ఆసక్తితో ఈ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వీక్షించారు. ఓటీటీని ప్రవేశపెట్టినప్పటి నుండి వీక్షకుల సంఖ్య గేమ్ చరిత్రలో అత్యధికంగా ఉంది. ఉత్కంఠ భరితమైన పోటీ వీక్షకులను కట్టిపడేసింది. ఎందుకంటే రెండు జట్ల ప్రదర్శనలను చూస్తుంటే మ్యాచ్ ఎలాగైనా సాగవచ్చు.
ఈ మైలురాయిపై డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియా హెడ్ సజిత్ శివానందన్ మాట్లాడుతూ.. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు రెండు జట్లకు అభినందనలు. టీమ్ ఇండియా వారి అద్భుతమైన నైపుణ్యం, అంకితభావంతో మిలియన్ల మందికి ఆనందం అందించింది. ఆ క్షణాలను వారి ఇళ్లకు అందించినందుకు మేము గర్విస్తున్నాము. " అని పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం కావడంతో రోహిత్ శర్మ తన ఫ్యాన్స్ కోసం మనసుకు హత్తుకునే పోస్టు నెట్టింట పంచుకున్నాడు. తన సంతోషాన్ని వ్యక్తీకరించేందుకు మాటలు చాలట్లేదు. ఈ విజయం తనకు ఎంత ముఖ్యమో వర్ణించడం కష్టం. ఇప్పుడు కోట్లాది మంది ప్రజల కల నిజమైనందుకు ఆనందంలో మునిగితేలుతున్నానని రోహిత్ శర్మ పోస్టు చేశాడు. కప్ గెలిచిన అనంతరం, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.