బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (15:56 IST)

యువరాజ్ సింగ్ రికార్డును బద్దలుగొట్టిన ఆ క్రికెటర్

భారత క్రికెటర్ రోహిత్ శర్మ మరో రికార్డును నెలకొల్పారు. భారత బెవాన్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును చెరిపేశారు. కొలంబో వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో స్టాండ్‌బై కె

భారత క్రికెటర్ రోహిత్ శర్మ మరో రికార్డును నెలకొల్పారు. భారత బెవాన్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును చెరిపేశారు. కొలంబో వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో స్టాండ్‌బై కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలుగొట్టాడు. 
 
ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన రోహిత్ టీ20ల్లో తన సిక్సర్లను 75కు పెంచుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 74 సిక్సర్లతో యువరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయంగా క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.