నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ: ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదం.. లక్ష్మణ్ షాకిచ్చాడు..! (video)
నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై శతకం చేసిన నేపథ్యంలో.. ఏపీ వర్సెస్ తెలంగాణ వివాదానికి రుద్రరాజు అనే నెటిజన్ వివాదాన్ని రేపారు. తెలంగాణను కించపరిచేలా.. రుద్రరాజు అనే నెటిజన్ అవమానకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. వీవీఎస్ లక్ష్మణ్ గతంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యల వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
పింక్ కలర్ అనేది తెలంగాణ కలర్ అని, తాను తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తానంటూ ఆ వీడియోలో లక్ష్మణ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ రుద్రరాజ్‌కు భలే కౌంటరిచ్చేలా వున్నాయి.
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. నితీశ్ చేసిన సెంచరీ భారత ఇన్నింగ్స్‌లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే క్రికెట్ మాజీ ఆటగాళ్లతోపాటు క్రికెట్ అభిమానులు నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడారు.