గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (13:42 IST)

కెప్టెన్సీ ముణ్నాళ్ల ముచ్చటే.. అయినా బాధలేదు.. రోహిత్ శర్మ

బంగ్లాదేశ్‌తో ట్వంటీ-20 సిరీస్ కోసం నాయకత్వపు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఒక మ్యాచ్ అయినా వంద మ్యాచ్‌లు అయినా జట్టును లీడ్ చేయడం గొప్ప గౌరవం అంటున్నాడు. ముణ్నాళ్ల ముచ్చటైనా... తనకెలాంటి బాధలేదని చెప్పాడు. వన్టే క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు టీమిండియా పగ్గాలు అప్పగించాలని చాన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో తనను లాగవద్దన్నాడు. 
 
జట్టుకు అవసరమైన ప్రతిసారి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదన్నాడు. ఆట నేర్చుకునేటపుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా పెట్టుకుంటామని రోహిత్ తెలిపాడు. కోహ్లీకి తన మద్దతు ఉంటుందని వెల్లడించాడు. కానీ టీమిండియాకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని.. కానీ కెప్టెన్సీ గురించి మాత్రం ఎక్కువ ఆలోచించనని చెప్పాడు.