బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (12:16 IST)

మహిళా క్రికెటర్‌ నుంచి రూ.27 లక్షలు డిమాండ్ చేస్తున్న పశ్చిమ రైల్వే

ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచింది. ఆమె ప్రతిభకు మెచ్చి పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చింది.

ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచింది. ఆమె ప్రతిభకు మెచ్చి పంజాబ్ ప్రభుత్వం పోలీసు శాఖలో డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చింది. ఇపుడు ఆ ఉద్యోగంలో చేరేందుకు పశ్చిమ రైల్వే రూ.27 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మూడేళ్ల క్రితం హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌ మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐదేళ్ల వ‌ర‌కు పనిచేస్తానని హ‌ర్మ‌న్ ఒప్పంద ప‌త్రం మీద సంత‌కం చేసింది. ఒక‌వేళ ఒప్పందాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఐదేళ్ల‌ జీతాన్ని తిరిగి ఇవ్వాల‌ని అందులో ష‌ర‌తు ఉంది. ఈ కార‌ణంగా హ‌ర్మ‌న్ రాజీనామాను ప‌శ్చిమ రైల్వే అంగీక‌రించ‌డం లేదు. అంతేకాకుండా ఐదేళ్ల జీతంగా రూ.27 ల‌క్ష‌లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తోంది.
 
ఈ విష‌య‌మై హ‌ర్మ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. త‌న‌కు గ‌త ఐదు నెల‌లుగా జీతం రావ‌డం లేద‌ని, త‌న‌కు మూడేళ్ల పాటు జీతం ఇచ్చి, ఇప్పుడు ఐదేళ్ల జీతాన్ని చెల్లించ‌మ‌న‌డం స‌బబుకాద‌ని వాపోతోంది. ఈ స‌మ‌స్య‌పై పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాసిన‌ప్ప‌టికీ ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేద‌ని హ‌ర్మ‌న్ వాపోయింది.