శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:58 IST)

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్

పుణె టెస్టులో భారత్ అత్యధికమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాకు 326 పరుగుల ఆధిక్యం రావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో ఫాలో ఆన్ ఆడించేందుకు మొగ్గు చూపాడు. దీనితో ఆదివారం నాడు ఫాలోఆన్లో భాగంగా సఫారీలు బ్యాటింగుకు దిగారు.
 
తొలి ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని అర్థం చేసుకోకుండా ఆడబోయి డకౌట్ అయ్యాడు మార్ క్రమ్. ఆ బంతి అతడికి అందకుండా నేరుగా వెళ్లి అతడి ప్యాడ్లకు తగిలింది. దీనితో ఇషాంత్ ఎల్బిడబ్ల్యు అంటూ అరిచాడు. అంపైర్ ఔటంటూ వేలెత్తాడు. కానీ రీప్లే చూస్తే బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ మార్ క్రమ్ మాత్రం అప్పీల్ కోరకుండా పెవిలియన్ దారి పట్టాడు. మరి ఈ మ్యాచులో విజయం సాధిస్తారో లేదంటే పరాజయం మూటగట్టుకుంటారో చూడాలి.