ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (16:46 IST)

రిషభ్ పంత్ సెంచరీ.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్.. బాగా ఆడావు స్పైడీ!

టీమిండియా వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్.. ఇటీవలి కాలంలో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ ఆధిక్యం సాధించడంలో పంత్ పాత్ర చాలానే ఉంది. 
 
ఈ ఇన్నింగ్సులో పంత్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో 118 బంతులు ఎదుర్కొన్న పంత్ 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్సులో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.

అంతర్జాతీయ మ్యాచుల్లో పంత్‌కు ఇదే తొలి సెంచరీ. పంత్ సెంచరీ కొట్టగానే డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పటికే వైరల్ అయింది.
 
ఇదిగో ఇప్పుడు ఈ రేసులో మరో బ్యాట్స్‌మెన్ చేరాడు. అతనే మన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. పంత్ సెంచరీ కొట్టిన సందర్భంగా అతనితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రోహిత్.. పంత్ ఆటతీరును మెచ్చుకున్నాడు. ''మెంటలోడు కదా. కానీ బాగా ఆడావు స్పైడీ'' '' అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.